- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB: కోహ్లీ పోస్టర్ ముందు మేక బలి.. ముగ్గురు ఆర్సీబీ ఫ్యాన్స్ అరెస్ట్!
చెన్నయ్‌పై ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆర్సీబీ పోస్టర్ ముందు ఒక మేకను బలిచ్చారు ముగ్గురు ఫ్యాన్స్. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, స్పోర్ట్స్: కర్ణాటకలోని చిత్రదుర్గలో ముగ్గురు ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఫ్యాన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విరాట్ కోహ్లీ ఉన్న ఆర్సీబీ (RCB) పోస్టర్ ముందు సన్న పాలయ్య (22), జయన్న (23), తిప్పె స్వామి (28) ఒక మేకను బలిచ్చారు. అనంతరం మేక రక్తంతో పోస్టర్‌కు రక్తాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటీవల చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై ఆర్సీబీ ఉత్కంఠభరిత విజయం సాధించడంతో.. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ముగ్గురూ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో యష్ దయాళ్ అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నయ్ బ్యాటర్లను నిలువరించి ఆర్సీబీని (RCB) విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమైంది. లీగ్ దశలో ఈ టీం మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది, వీటిలో ఏ ఒక్కటి గెలిచినా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరడం ఖాయం.






