- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH
ఐపీఎల్ 2025(IPL)లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL)లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయబోతున్నది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు.. మూడింట్లో గెలిచి.. ఆరు మ్యాచుల్లో ఓడింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. ఇక గుజరాత్ సైతం తొమ్మిది మ్యాచులాడి.. మూడింట్లో ఓడి, ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది.
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ.
గుజరాత్: శుభమాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కరీం జనత్/ఇషాంత్ శర్మ.






