ఐపీఎల్‌లో వారం బ్రేక్.. ఆ జట్లకు పెద్ద ప్లస్: సునీల్ గవాస్కర్

by Phanindra |

ఐపీఎల్ 2025 వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ బ్రేక్ కొన్ని జట్లకు చాలా ఉపయోగపడుతుందని సునీల్ గవాస్కర్ చెప్తున్నాడు.

ఐపీఎల్‌లో వారం బ్రేక్.. ఆ జట్లకు పెద్ద ప్లస్: సునీల్ గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని జట్లకు ఈ బ్రేక్ ఉపయోగపడుతుందని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు తమ ప్లాన్లలో మార్పులు చేసుకునే సమయం ఇప్పుడు దొరికిందని గవాస్కర్ అన్నాడు.

‘నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఎక్కువ సేపుంటే ఒక్కోసారి బ్యాటర్లు రిథమ్ కోల్పోతారు. కాసేపు గ్యాప్ వస్తేనే మొమెంటం దెబ్బతింటుంది. అలాగే ఇప్పుడు వచ్చిన వారం రోజుల గ్యాప్ కూడా వరుసగా విజయాలు సాధిస్తున్న జట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది’ అని గవాస్కర్ వివరించాడు. ఢిల్లీ, ముంబై, పంజాబ్ వంటి జట్లకు మాత్రం ఈ బ్రేక్ బాగా ఉపయోగపడుతుందన్నాడు. ఈ జట్లు తమ ప్లాన్లను మెరుగుపరుచుకునే సమయం దొరికిందని సన్నీ చెప్పాడు.

Next Story