- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ప్లేఆఫ్స్ మిస్సవుతున్న ప్లేయర్స్.. వారి రిప్లేస్‌మెంట్ ఎవరు?
ప్లేఆఫ్స్ మిస్సవుతున్న ప్లేయర్స్.. వారి రిప్లేస్‌మెంట్ ఎవరు?
by Phanindra |
కొందరు స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ మిస్సవుతున్నారు. వాళ్ల స్థానాల్లో ఫ్రాంచైజీలు కొత్త వారితో ఒప్పందాలు చేసుకున్నాయి. వారెవరంటే?

X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరింది. పంజాబ్, బెంగళూరు, గుజరాత్, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే భారత్-పాక్ ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ షెడ్యూల్ వారం రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచులు ఉండటంతో ప్లేఆఫ్స్ ఆడే జట్లలోని కొందరు ప్లేయర్లు తమ తమ ఫ్రాంచైజీలకు దూరం కానున్నారు. దీంతో వారి స్థానాల్లో తాత్కాలికంగా ఇతర ప్లేయర్లతో ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంతకీ ఆ ప్లేయర్లు ఎవరో చూద్దామా?
- ముంబై ఇండియన్స్: ఈ టీంలో విల్ జాక్స్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండరు. వీరి స్థానాల్లో చరిత్ ఆశలంక, రిచర్డ్ గ్లీసన్, జానీ బెయిర్‌స్టో ఆడనున్నారు.
- పంజాబ్ కింగ్స్‌లో మార్కో యాన్సెన్ ప్లేఆఫ్స్ మిస్సవుతున్నాడు. అయితే అతని స్థానాన్ని రిప్లేస్ చేసే ప్లేయర్‌ను పంజాబ్ ఇంకా ప్రకటించలేదు.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు లుంగి ఎన్గిడీ, జాకబ్ బెథెల్ కూడా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో బ్లెస్సింగ్ ముజరబని, టిమ్ సీఫెర్ట్‌ను ఆ జట్టు తీసుకుంది.
- గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ, జాస్ బట్లర్ సేవలు కోల్పోనుంది. వీరిలో బట్లర్ స్థానంలో కుశాల్ మెండిస్‌ను తీసుకున్న జీటీ.. రబాడ రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు
Next Story






