- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL: ‘ఇది అద్భుతమైన రోజు’.. ఫైనల్ మ్యాచ్‌పై శ్రేయాస్ అయ్యార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్(IPL) 2025 సీజన్ నేటితో ముగియనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరగనున్న ఫైనల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) తలపడనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL) 2025 సీజన్ నేటితో ముగియనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరగనున్న ఫైనల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. టాస్ సమయంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్(Shreyas Iyer) మాట్లాడారు. ‘‘నా మనసుకు, నా శరీరానికి సానుకూల సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన రోజు. జనం ఉత్సాహంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఇక్కడికి వచ్చి వారిని ఆదరించడం. నా టీమ్మేట్స్ కూడా ఉత్సాహంగా, ఫిట్‌గా ఉన్నారు. టీమ్ మీటింగ్‌లో కూడా అదే మాట్లాడుకున్నాం. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అని చెప్పాను’’ అని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చారు.
బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రొమారొయో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్‌వుడ్
పంజాబ్: ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.






