ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో విజయం.. పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌లోకి RCB

by Gantepaka Srikanth |

అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ(Delhi Capitals)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు ఘన విజయం సాధించింది.

ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో విజయం.. పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌లోకి RCB
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ(Delhi Capitals)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (51), కృనాల్ పాండ్యా (73) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. మొత్తంగా 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూరు 165 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు, చమీరా ఒక తీశాడు. ఈ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది ఏడో విజయం. ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు, హేజుల్ వుడ్ రెండు వికెట్లు, యశ్ దయాల్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

Next Story