- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL2025: అత్యంత కీలకమైన మ్యాచ్.. టాస్ గెలిచిన RCB
ఐపీఎల్(IPL) 2025లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL) 2025లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) తలపడుతున్నాయి. ఛంఢీగడ్‌లోని ముల్లాన్‌పుర్ ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో తొలుత పంజాబ్ బ్యాటింగ్ చేయబోతున్నది. ఇదిలా ఉండగా.. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ మొదటిసారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇది జరగడం గమనార్హం. ఈ జట్టు ఇంతకు ముందు చివరగా 2014లో ప్లేఆఫ్స్‌నకు చేరుకుంది. మరో వైపు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ కూడా బలంగా కనిపిస్తోంది. క్వాలిఫయర్- 1 నేపథ్యంలో అభిమానులందరి కళ్లు వరుణుడి మీదే ఉన్నాయి. ఈ సీజన్‌లో వాన వల్ల పలు మ్యాచ్‌లు ప్రభావితమ్యాయి. కానీ ఈ సారి అలాంటి ముప్పేమీ ఉండబోదని వాతావరణ శాఖ భరోసా ఇస్తోంది.
పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్.
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.






