చిన్నపిల్లాడిలా మారిన పంత్.. సెంచరీ చేసిన ఆనందంలో ఏం చేశాడో చూడండి

by Harish |

ఒకే ఒక ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.

చిన్నపిల్లాడిలా మారిన పంత్.. సెంచరీ చేసిన ఆనందంలో ఏం చేశాడో చూడండి
X

దిశ, స్పోర్ట్స్ : ఒకే ఒక ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఈ సీజన్‌లో రిషబ్ దారుణంగా విఫలమయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు 12 ఇన్నింగ్స్‌లో ఓ హాఫ్ సెంచరీ మినహా గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రూ. 27 కోట్లు దండగ అంటూ విమర్శలపాలయ్యాడు. కానీ, ఆఖరి మ్యాచ్‌లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీని పూర్తి చేశాడు.

శతకం తర్వాత పంత్ ఆనందానికి అవధుల్లేవు. సంతోషాన్ని పట్టలేక మైదానంలోనే పల్టికొట్టాడు. ఆ తర్వాత పూరన్‌కు గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో పంత్‌కు రెండో సెంచరీ. ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేస్తే.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే 118 రన్స్ చేశాడు. మొత్తంగా 13 ఇన్నింగ్స్‌ల్లో 269 పరుగులు చేశాడు. తాజా సెంచరీతో ఐపీఎల్‌లో 3వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. అలాగే, డికాక్(140), స్టోయినిస్(124) తర్వాత లక్నో తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కూడా పంతే.


Next Story