ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో అవుట్.. కారణం అదే అంటున్న రిషభ్ పంత్!

by Phanindra |   (  Updated:2025-05-20 15:49:03  IST  )

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో తప్పుకుంది. దీనికి కారణం ఏంటో కెప్టెన్ రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో అవుట్.. కారణం అదే అంటున్న రిషభ్ పంత్!
X

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తప్పుకుంది. ఈ క్రమంలో తాము టోర్నీ ఆరంభంలో బాగానే ఆడినా, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ చెప్పాడు. ‘టోర్నీ మొదలయ్యే సమయంలో ఇది మాకు బెస్ట్ సీజన్ అవుతుందని అనుకున్నాం. కానీ గాయాలు ఇబ్బంది పెట్టాయి. దీన్ని పట్టించుకోకుండా ఆడాలని అనుకున్నాం. కానీ ఆ ఖాళీలను భర్తీ చెయ్యలేకపోయాం’ అని పంత్ అన్నాడు.

‘వేలంలో తీసుకున్న బౌలింగ్ ఎటాక్ ఉంటే మా కథ వేరేలా ఉండేది. కానీ క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే మేం ఆడుతున్న విధానం చూస్తే మాత్రం చాలా గర్వంగా ఉంది. సమస్యలు చూసి బాధపడేకన్నా మా ఆటలో పాజిటివ్ విషయాలపై ఫోకస్ పెట్టడం మంచిది’ అని పంత్ అభిప్రాయపడ్డాడు.

లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ అందరూ గాయాలతో సతమతమయ్యారు. మొహ్‌సిన్ పూర్తిగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. మయాంక్ కేవలం రెండు మ్యాచులే ఆడగలిగాడు. ఆవేష్, ఆకాష్ కూడా సీజన్ మొత్తం ఆడలేపోయారు. ఈ క్రమంలో జట్టులోకి తీసుకున్న శార్దూల్ ఠాకూర్ ఆరంభంలో ఆకట్టుకున్నా ఆ తర్వాత గాడితప్పాడు. దీంతో లక్నో బౌలింగ్ విభాగం చాలా పేలవంగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయడ్డారు.

Next Story