బౌలర్‌ను తక్కువ చెయ్యడం ఎందుకు?.. పంత్‌పై మండిపడ్డ అశ్విన్

by Phanindra |   (  Updated:2025-05-28 15:12:54  IST  )

బౌలర్‌ను తక్కువ చెయ్యడం ఎందుకంటూ పంత్‌పై అశ్విన్ మండిపడ్డాడు. మన్కడింగ్ చేసిన దిగ్వేశ్‌కు మద్దతుగా నిలవాల్సిందన్నాడు.

బౌలర్‌ను తక్కువ చెయ్యడం ఎందుకు?.. పంత్‌పై మండిపడ్డ అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. ఆర్సీబీ, లక్నో మధ్య మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ.. జితేశ్ శర్మను మన్కడింగ్ చేసి అప్పీల్ చేశాడు. అయితే బౌలింగ్ యాక్షన్ పూర్తి చేసిన తర్వాత బంతిని రిలీజ్ చేయకుండా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లు కూల్చినా అది అవుట్ కాదు. దిగ్వేశ్ కూడా తన బౌలింగ్ యాక్షన్ పూర్తిచేసిన తర్వాతనే మన్కడింగ్ చేశాడు. బౌలింగ్ యాక్షన్ పూర్తయ్యే వరకు జితేశ్ క్రీజులోనే ఉన్నాడు. దీంతో అది నాటౌట్ అని థర్డ్ అంపైర్ చెప్పాడు. అయితే అంతకుముందే రిషభ్ పంత్ ఈ మన్కడింగ్ అప్పీల్‌ను వెనక్కు తీసేసుకున్నాడు. ఇలా చేయడంపై అశ్విన్ మండిపడ్డాడు.

ఆ సమయంలో కెప్టెన్‌గా పంత్ చేయాల్సిన పని దిగ్వేశ్‌కు మద్దతుగా నిలవడమని యాష్ అభిప్రాయపడ్డాడు. తన బౌలర్‌కు అండగా ఉండాల్సింది పోయి అప్పీల్ వెనక్కు తీసుకోవడంతో కోట్లాది మంది ప్రేక్షకుల ముందు దిగ్వేశ్‌ను చులకన చేసినట్లయిందన్నాడు. ‘కెప్టెన్ పని బౌలర్‌కు అండగా ఉండటం. అతన్ని తక్కువ చేయడం కాదు. ఇలా అప్పీల్ చేసిన తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడం ఏంటి? ఇలాంటివన్నీ ముందే డిస్కస్ చేసుకోవాలి కదా. ఇలా బౌలర్‌ను ఎందుకు తక్కవ చెయ్యాలి? ఇది బౌలర్‌ను అవమానించడమే’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

Next Story