IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్లు ఇవే!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-09 13:50:48  IST  )

ఐపీఎల్(IPL) 2025లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL) 2025లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఒకటి ఓడి.. మూడు గెలిచింది. రాజస్థాన్ కూడా నాలుగు మ్యాచులు ఆడి రెండు గెలిచింది.. రెండు ఓడింది. రెండు జట్లకూ ఇది ఐదో మ్యాచ్. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలని రెండూ జట్లు కసి మీదున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయబోతోంది.

గుజరాత్:
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

Next Story