- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: రప్ఫాడించిన రాజస్థాన్ బ్యాటర్లు.. పంజాబ్ ఎదుట భారీ టార్గెట్
ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఛండీగఢ్(Chandigarh) మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్(Rajasthan Royals) బ్యాట్మెన్లు అదరగొట్టారు.

దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఛండీగఢ్(Chandigarh) మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్(Rajasthan Royals) బ్యాట్మెన్లు అదరగొట్టారు. 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేశారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(67), కెప్టెన్ సంజూ శాంసన్(38), రియాన్ పరాగ్(36), నితీశ్ రాణా(12), హెట్మెయర్(20), ద్రువ్ జురేల్(13) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. పంజాబ్(Punjab Kings) గెలవాలంటే 206 పరుగులు చేయాల్సి ఉంది. పంజాబ్ బౌలర్లలో ఫెర్గుర్సన్ రెండు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ తలో వికెట్ తీశారు.
కాగా, ఇప్పటివరకు ఈ సీజన్లో రెండు మ్యాచులు ఆడిన పంజాబ్ రెండింట్లోనూ విజయం సాధించింది. ఇవాళ గెలిస్తే హ్యాట్రిక్ విజయాలు సాధించనున్నది. మరోవైపు ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండింట్లో ఓటమి చెంది, ఒకదాంట్లో విజయం సాధించింది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో కలిసి బ్యాటింగ్ చేసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగితే విజయ సాధించడం సులభం.






