- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అశ్విన్ సీఎస్కే నుంచి వెళ్లిపో.. ఒంటరిగా కూర్చోని ఏడుస్తాన్నానంటూ అశ్విన్ ఎమోషనల్
ఐపీఎల్-18లో చెన్నయ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో చెన్నయ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు. చాంపియన్గా చూసిన జట్టును ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందన్నాడు. అందుకే ఓ మూలన ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నానని చెప్పాడు. ఈ సీజన్లో అశ్విన్ గొప్పగా రాణించలేదు. 9 మ్యాచ్ల్లో 7 వికెట్లే తీశాడు. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు.
Ashwin Responded to “Leave my beautiful Franchise “ quote
— Prakash (@definitelynot05) May 27, 2025
🔗 https://t.co/Z7LnBKN4Dj pic.twitter.com/wvyQux3IBc
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ లైవ్ సెషన్లో అశ్విన్ పాల్గొనగా.. ఓ సీఎస్కే ఫ్యాన్ ‘అశ్విన్ నువ్వు సీఎస్కే నుంచి వెళ్లిపో’ అని కామెంట్ చేశాడు. దీనికి అశ్విన్ స్పందిస్తూ.. తాను పేలవ ప్రదర్శన చేసినట్టు అంగీకరించాడు. వచ్చే సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు బలంగా తిరిగివస్తానని తెలిపాడు. అభిమానులను తాను అర్థం చేసుకోగలనని, ఫ్యాన్స్ కంటే ఎక్కువగా తాను సీఎస్కేను ప్రేమిస్తానని చెప్పాడు. ఐపీఎల్ ప్లేయర్గా తానెప్పుడు ఇంతగా నిరుత్సాహానికి గురికాలేదన్నాడు. సీఎస్కే తరపున టైటిల్స్ గెలిచానని, ప్లే ఆఫ్స్ ఆడానని, కానీ, ఈ సీజన్ ఫలితం తనను తీవ్రంగా బాధించిందని చెప్పుకొచ్చాడు. అందరి కంటే సీఎస్కే గురించి తాను ఎక్కువగా ఆలోచిస్తానని, నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై దృష్టిపెట్టినట్టు తెలిపాడు.






