IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-12 13:34:07  IST  )

ఐపీఎల్‌లో భాగంగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఇందుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium) వేదికగా మారింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా హైదరాబాద్ జట్టు బౌలింగ్ చేయబోతున్నది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన పంజాబ్ జట్టు.. ఒక దాంట్లో ఓడి.. మూడింట్లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు.. ఒక దాంట్లో గెలిచి.. నాలుగు మ్యాచుల్లో ఓడింది. పంజాబ్ వరుస విజయాలతో ఉండగా.. హైదరాబాద్ వరుస అపజయాలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని SRH జట్టు చూస్తోంది.

హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్/జయ్‌దేవ్ ఉనద్కత్, రాహుల్ చాహర్.

పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, యష్‌జయ్ ఠాకూర్.

Next Story