IPL 2025: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. లక్నో ఖాతాలో మరో ఓటమి

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-01 17:18:28  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఘన విజయం సాధించింది.

IPL 2025: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. లక్నో ఖాతాలో మరో ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఘన విజయం సాధించింది. లక్నో(Lucknow Super Giants) నిర్ధేశించిన 171 పరుగులు లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా(08) నిరాశ పర్చగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(69), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(52), నేహాల్ వధేరా(43) అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లంతా విఫలం అయ్యారు.

ఇక టాస్ ఓడి ముందుగా లక్నో బ్యాటింగ్ చేసింది. మార్కరమ్(28), నికోలస్ పూరన్(44), ఆయూష్ బదోని(41), అబ్దుల్ సమద్(27), డేవిడ్ మిల్లర్(19) రాణించి జట్టుకు 171 పరుగుల గౌరవపద్రమైన స్కోరును అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్హదీప్ సింగ్ మూడు వికెట్లు, ఫెర్గుర్‌సన్, మాక్స్‌వెల్, జాన్సన్, చాహల్ తలో వికెట్ తీశారు.

Next Story