IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్.. కోల్‌కతాకు అగ్ని పరీక్ష

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-26 14:30:19  IST  )

ఐపీఎల్‌ 2025(IPL)లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్.. కోల్‌కతాకు అగ్ని పరీక్ష
X

దిశ, వెబ్‌డెస్: ఐపీఎల్‌ 2025(IPL)లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో కోల్‌కతా తొలుత బౌలింగ్ చేయబోతున్నది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోల్‌కతా మూడింట్లో విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇక ఎనిమిది మ్యాచులు ఆడిన పంజాబ్.. ఐదు మ్యాచుల్లో విజయం సాధించగా, మూడు మ్యాచుల్లో ఓడింది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలక కానుంది.

Kolkata : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ/రోవ్‌మాన్ పావెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ రాణా.

Punjab : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రర్/వైషక్ విజయ్‌కుమార్.

Next Story