- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhsimran Singh: నరకం అనుభవిస్తూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్న తండ్రి!
పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో కనీసం నడవలేని స్థితిలో ఉన్నారట. అయినా సరే కొడుకు ఆడుతుంటే బాధలన్నీ మర్చిపోతారట.

దిశ, స్పోర్ట్స్ డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. దీంట్లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ పాత్ర కూడా చాలా కీలకం. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్.. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇలా అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో ప్రభ్‌సిమ్రన్ తండ్రి సర్దార్ సూర్జిత్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం వెలుగు చూసింది. వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ, నిరంతరం తీవ్రమైన నొప్పితో పోరాడుతున్నారట సూర్జిత్ సింగ్.
అయితే తన కొడుకు క్రీజులో దుమ్ముదులిపే సమయంలో మాత్రం తన బాధను మర్చిపోయి, నవ్వుతూ మ్యాచ్ చూస్తాడని సూర్జిత్ సోదరుడు సత్వీందర్‌పాల్ సింగ్ తెలిపారు. లక్నో మ్యాచ్‌లో సెంచరీ మిస్ చేసుకున్నందుకు ప్రభ్‌సిమ్రన్‌పై సూర్జిత్ కోపంతో అరిచేశాడని, అలాంటి సమయంలో తన బాధను మర్చిపోతాడని సత్వీందర్‌పాల్ తెలిపారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న సూర్జిత్‌ను పంజాబ్ మ్యాచులు ఉన్న సమయంలో తనే ఎత్తుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతానని, ఇద్దరం కలిసే మ్యాచ్ చూస్తామని ఆయన చెప్పారు.






