PBKS vs DC: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. మారనున్న పంజాబ్, లక్నో మ్యాచ్ వేదిక?

by Phanindra |

ఆపరేషన్ సింధూర్‌ కారణంగా పలు ఎయిర్‌పోర్టులు మూతపడ్డాయి. దీంతో పంజాబ్, ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చే అవకాశాలున్నాయి.

PBKS vs DC: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. మారనున్న పంజాబ్, లక్నో మ్యాచ్ వేదిక?
X

దిశ, స్పోర్ట్స్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలోని పలు ఎయిర్‌పోర్టులను భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశారు.

దీంతో గురువారం నాడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే (PBKS vs DC) మ్యాచ్‌ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. అయితే ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ధర్మశాలతోపాటు దగ్గరలోని చండీగఢ్ ఎయిర్‌పోర్టును కూడా ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఢిల్లీ జట్టును ధర్మశాలకు ఎలా తీసుకురావాలని ఐపీఎల్ నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు.

ప్రస్తుతానికి పంజాబ్ జట్టంతా ధర్మశాలలోనే ఉంది. ఆదివారం నాడు ముంబై ఇండియన్స్‌తో కూడా ఇక్కడే పంజాబ్ మరో (PBKS vs MI) మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఎయిర్‌పోర్టులు మూసివేయడంతో ఢిల్లీ, ముంబై జట్లు ధర్మశాల చేరుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వంతో బీసీసీఐ (BCCI) చర్చలు జరుపుతోందని, దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

Next Story