SRH ఖాతాలో మరో ఓటమి.. కీలక మ్యాచ్‌లో ముంబై విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-17 17:54:10  IST  )

వాంఖడే(Wankhede Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఘన విజయం సాధించింది.

SRH ఖాతాలో మరో ఓటమి.. కీలక మ్యాచ్‌లో ముంబై విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే(Wankhede Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో Four Wickets తేడాతో విక్టరీ సాధించారు. ముందుగా టాస్ ఓడి SRH జట్టు బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ (40), ట్రావిస్ హెడ్ (28), నితీష్ కుమార్ రెడ్డి (19), హెన్రిచ్ క్లాసెన్ (37), అనికేత్ వర్మ (18) రాణించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.

ఇక 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు అదరగొట్టారు. రోహిత్ శర్మ (26), రికెల్టన్ (31) పర్వాలేదు అనిపించగా.. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ (36), సూర్యకుమార్ (26), తిలక్ వర్మ (16), హార్దిక్ పాండ్యా (21) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. మొత్తంగా 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ముంబై 166 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీయగా, హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశారు.

Next Story