MI vs SRH: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

MI vs SRH: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ముంబైలోని వాంఖడే మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నది. కాగా, ఈ సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడిన ముంబై, ఎస్ఆర్‌హెచ్.. చెరో రెండు గెలిచి.. నాలుగు మ్యాచులు ఓడిపోయాయి. పాయింట్ల పట్టికలో సేమ్ పొజీషన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను రెండు జట్లూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఈషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కత్

ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ

Next Story