- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MS Dhoni: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు.. ప్రాక్టీస్‌కు ధోనీ డుమ్మా..!
కేకేఆర్, సీఎస్కే మ్యాచ్ ముందు ధోనీని చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. కానీ ధోనీ మాత్రం ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టాడు.

దిశ, స్పోర్ట్స్: ఈడెన్ గార్డెన్స్‌లో ఎంఎస్ ధోనీని (MS Dhoni) చూసేందుకు వచ్చిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కేకేఆర్‌తో మ్యాచ్ కోసం చెన్నై టీం చేస్తున్న ప్రాక్టీస్‌కు ధోనీ వరుసగా రెండో రోజు డుమ్మా కొట్టాడు. తమ అభిమాన క్రికెటర్‌ను ప్రాక్టీస్‌లో చూసేందుకు వందలాది మంది ఫ్యాన్స్ ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. కానీ ధోనీ మాత్రం ప్రాక్టీస్‌కు రాలేదు. దీంతో ధోనీకేమైనా గాయమైందా? కేకేఆర్‌తో జరిగే మ్యాచులో తను ఆడటం లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni) ఆడతాడని సీఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్పష్టం చేశాడు. ‘ధోనీ ఫిట్‌గానే ఉన్నాడు. తన పరిస్థితి ఎలా ఉందో ధోనీకి బాగా తెలుసు. టోర్నీ ఆరంభం సమయంలో ధోనీ చాలా కష్టపడతాడు. తను రెడీ అనుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇలా రెస్ట్ తీసుకుంటాడు. ఈ విషయంలో ఇబ్బందేం లేదు’ అని వివరించాడు.






