ధోనీ ఖాతాలో మరో రికార్డు.. కోహ్లీ, రోహిత్ జాబితాలో చేరిన సీఎస్కే కెప్టెన్

by Harish |

టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్, చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ మరో రికార్డు తనపేరిట లిఖించుకున్నాడు.

ధోనీ ఖాతాలో మరో రికార్డు.. కోహ్లీ, రోహిత్ జాబితాలో చేరిన సీఎస్కే కెప్టెన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్, చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ మరో రికార్డు తనపేరిట లిఖించుకున్నాడు. కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఐపీఎల్-18లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో మాహీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడిన 4వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. ధోనీ కంటే ముందు రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. కెరీర్ అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ 456 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత కార్తీక్(412), కోహ్లీ(408), ధోనీ(400) ఉన్నారు. వరల్డ్ క్రికెట్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ రికార్డు విండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. అతను 695 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ఫార్మాట్‌లో ధోనీకి ఘనమైన రికార్డు ఉంది. 136 స్ట్రైక్‌రేటుతో 7,566 రన్స్ చేశాడు.


Next Story