IPL: ప్రతీకారం తీర్చుకున్న లక్నో.. హైదరాబాద్‌పై ఘన విజయం

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-27 17:39:04.0  )
IPL: ప్రతీకారం తీర్చుకున్న లక్నో.. హైదరాబాద్‌పై ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్‌(sunrisers Hyderabad)పై లక్నో(Lucknow Super Giants) జట్టు ప్రతీకారం తీర్చుకున్నది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ఇవాళ్టి మ్యాచ్‌లో లక్నో జట్టు ఘన విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత టాస్ ఓడి హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ(06), ఇషాన్ కిషన్(0) మినహా మిగిలిన ప్లేయర్లంతా రాణించారు. హెడ్(47), నితీష్ కుమార్ రెడ్డి(32), హెన్రిచ్ క్లాసెన్(26), అనికేత్ వర్మ(36) రాణించారు. మొత్తంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు, ఆవేశ్ ఖాన్, రాతి, రవి బిష్ణోయ్, యాదవ్ తలో వికెట్ తీశారు.

191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లు కూడా ముందు నుంచే అద్భుతంగా రాణించారు. మిచెల్ మార్ష్(52), నికోలస్ పూరన్(70), అబ్దుల్ సమద్(22), డేవిడ్ మిల్లర్(13) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ రెండు వికెట్లు తీయగా, షమీ, జాంపా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.



Next Story

Most Viewed