IPL 2025: నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన KKR

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-04 14:03:13  IST  )

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్‌(Rajasthan Royals)తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా(Kolkata Knight Riders) సంచలన విజయం సాధించింది.

IPL 2025: నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన KKR
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్‌(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా(Kolkata Knight Riders) సంచలన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మొత్తంగా 20 ఓవర్లలో నాలు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేశారు. కేకేఆర్ బ్యాటర్లలో గుర్బాజ్ (35), రహానే (30), రఘువంశీ (44), రస్సెల్ (57), రింకూ సింగ్ (19), సునీల్ నరైన్ (11) పరుగులతో రాణించి జట్టుకు భారీ స్కోరును అందించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, యుధ్‌వీర్, తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు.

ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యాటర్లలో చాలామంది విఫలం అయ్యారు. జైస్వాల్ (34), రియాన్ పరాగ్ (95) అద్భుతంగా రాణించారు. చివర్లో హేట్మేయర్ (29), శుభమ్ దూబే (25) పరుగులతో చివరి వరకూ పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 205 పరుగులు చేసి ఓటమి పాలైంది. కోల్‌కతా బౌలర్లలో మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా, వైభవ్ అరోరా ఒక వికెట్ తీశారు.

Next Story