- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KKR vs CSK: కేకేఆర్ కొంపముంచిన చెన్నయ్.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓటమి!
చెన్నై చేతిలో సొంత మైదానంలో కేకేఆర్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దిశ, స్పోర్ట్స్: డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలకు చెన్నయ్ పెద్ద గండికొట్టింది. తప్పక నెగ్గాల్సిన మ్యాచులో చెన్నయ్ సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం ఆ జట్టు కొంపముంచింది. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న కేకేఆర్.. తన చివరి రెండు మ్యాచులు గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమనే చెప్పాలి. చెన్నయ్ ముందు భారీ టార్గెట్ పెట్టాలనుకున్న కేకేఆర్ ప్లాన్‌ను నూర్ అహ్మద్ దెబ్బతీశాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు పడగొట్టిన అతను.. కేకేఆర్ బ్యాటర్లు గేర్లు మార్చకుండా అడ్డుకున్నాడు. దీంతో 20 ఓవర్లలో కేకేఆర్ కేవలం 179 పరుగులే చేయగలిగింది. ఛేజింగ్‌లో కేకేఆర్‌కు బౌలర్లు అదిరే ఆరంభం అందించారు. తొలి పవర్‌ప్లేలోనే సగం మంది చెన్నయ్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. కానీ డెవాల్డ్ బ్రెవిస్ (52), శివమ్ దూబే (45) అద్భుతంగా ఆడి చెన్నయ్ను విజయ తీరాలకు చేర్చారు. 2018 తర్వాత 180 అంతకంటే పెద్ద స్కోరును చెన్నయ్ ఛేజ్ చేయడం ఇదే తొలిసారి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ మ్యాచులో హోంటీంకు నిరాశ తప్పలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌కు గుర్బాజ్ (11), నరైన్ (26) శుభారంభం ఇవ్వలేకపోయారు. రహానే (48), మనీష్ పాండే (36 నాటౌట్), రస్సెల్ (38) రాణించినా.. అవసరమైన సమయంలో గేర్లు మార్చలేకపోయారు. రఘువంశీ (1), రింకూ సింగ్ (9) విఫలమవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 179/6 స్కోరు మాత్రమే చేయగలిగింది.
చేజారింది అక్కడే..
లక్ష్య ఛేదనలో చెన్నయ్ను కోల్‌కతా బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. ఆయుష్ మాత్రే (0), డెవాన్ కాన్వే (0), అశ్విన్ (8) ఎవర్నీ క్రీజులో కుదురుకోనివ్వలేదు. కేకేఆర్ బౌలర్ల ధాటికి చెన్నయ్ తొలి ఆరు ఓవర్లలో 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఆచితూచి ఆడిన డెవాల్డ్ బ్రెవిస్ (52), శివమ్ దూబే (45) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఛేజింగ్ కొంచెం గాడిలో పడిందనగానే బ్రెవిస్ చెలరేగాడు. వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లలో వరుస బౌండరీలతో విరుచుకుపడి ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇక్కడి నుంచే మ్యాచ్ కేకేఆర్ చేజారిందని చెప్పాలి.
ఫినిష్ చేసిన ధోనీ..
అయితే 19వ ఓవర్లో వైభవ్ అద్భుతమైన బౌలింగ్‌తో దూబే, నూర్ అహ్మద్ (2)లను పెవిలియన్ చేర్చి కేకేఆర్‌ను మళ్లీ రేసులోకి తీసుకొచ్చాడు. చివరి ఓవర్లో ధోనీ (17 నాటౌట్) లాంఛనం పూర్తిచేయడంతో చాలా గ్యాప్ తర్వాత చెన్నయ్ ఖాతాలో విజయం చేరింది. 180 పరుగుల లక్ష్యాన్ని చెన్నయ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమి తర్వాత కూడా కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే.. ముంబై (14 పాయింట్లు), ఢిల్లీ (13 పాయింట్లు), లక్నో (10 పాయింట్లు) జట్లు 14 పాయింట్ల దగ్గరే ఆగిపోవాలి. అంటే ఈ జట్లు ఆడిన ప్రతి మ్యాచులో ఓడాలి. ముంబై ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. లక్నో, ఢిల్లీ ఇంకా మూడు మ్యాచులు ఆడాలి. ముంబై, ఢిల్లీ టీమ్స్ ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా కేకేఆర్ ఎలిమినేట్ అయిపోతుంది.
బాంబు బెదిరింపులు..
ఈ మ్యాచ్ జరుగుతుండగానే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్)కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిందట. స్టేడియాన్ని పేల్చేస్తామంటూ అజ్ఞాత వ్యక్తులు ఈ మెయిల్ పంపారు. అలాగే గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి కూడా ఇలాంటి బెదిరింపే రావడం గమనార్హం.
స్కోరు బోర్డు:
కోల్‌కతా ఇన్నింగ్స్: 179/6 (20 ఓవర్లు)
బ్యాటింగ్: రహ్మనుల్లా గుర్బాజ్ (సి) నూర్ అహ్మద్ (బి) కాంబోజ్ 11, సునీల్ నరైన్ (స్టంపింగ్) ధోనీ (బి) నూర్ అహ్మద్ 26, అజింక్య రహానే (సి) కాన్వే (బి) జడేజా 48, రఘువంశీ (సి) ధోనీ (బి) నూర్ అహ్మద్ 1, మనీష్ పాండే (36 నాటౌట్), ఆండ్రీ రస్సెల్ (సి) బ్రెవిస్ (బి) నూర్ అహ్మద్ 38, రింకూ సింగ్ (సి) మాత్రే (బి) నూర్ అహ్మద్ 9, రమణ్‌దీప్ సింగ్ (4 నాటౌట్)
ఎక్స్‌ట్రాలు : 6
వికెట్ల పతనం : 1-11, 2-69, 3-71, 4-103, 5-149, 6-167,
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ (2-0-14-0), అన్షుల్ కాంబోజ్ (3-0-38-1), రవిచంద్రన్ అశ్విన్ (3-0-19-0), నూర్ అహ్మద్ (4-0-31-4), రవీంద్ర జడేజా (4-0-34-1), మతీష పతిరాణా (4-0-39-0)
చెన్నయ్ ఇన్నింగ్స్: 183/8 (19.4 ఓవర్లలో)
బ్యాటింగ్: ఆయుష్ మాత్రే (సి) హర్షిత్ రాణా (బి) వైభవ్ అరోరా 0, డెవాన్ కాన్వే (బి) మొయీన్ అలీ 0, ఉర్విల్ పటేల్ (సి) వరుణ్ చక్రవర్తి (బి) హర్షిత్ రాణా 31, అశ్విన్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 8, జడేజా (బి) వరుణ్ చక్రవర్తి 19, డెవాల్డ్ బ్రెవిస్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ చక్రవర్తి 52, శివమ్ దూబే (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 45, ధోనీ (17 నాటౌట్), నూర్ అహ్మద్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 2, అన్షుల్ కాంబోజ్ (4 నాటౌట్)
ఎక్స్‌ట్రాలు : 5
వికెట్ల పతనం: 1-0, 2-25, 3-37, 4-56, 5-60, 6-127, 7-170, 8-172
బౌలింగ్: వైభవ్ అరోరా (3-0-48-3), మొయీన్ అలీ (2-0-23-1), హర్షిత్ రాణా (4-0-43-2), వరుణ్ చక్రవర్తి (4-0-18-2), సునీల్ నరైన్ (4-0-28-0), ఆండ్రీ రస్సెల్ (2.4-0-22-0)






