- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ క్వాలిటీకి ఢోకా లేదు.. దాదాపు విదేశీ ప్లేయర్లంతా రిటర్న్
ఐపీఎల్‌కు దాదాపుగా అందరు విదేశీ ప్లేయర్లు రిటర్న్ అయ్యారని, లీగ్ క్వాలిటీకి ఎలాంటి ఢోకా ఉండబోదని అరుణ్ ధుమాల్ అన్నారు.

దిశ, స్పోర్ట్స్: భారత్, పాక్ ఉద్రిక్తతల వల్ల వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ పునఃప్రారంభమైంది. అయితే పలువురు విదేశీ ప్లేయర్లు తిరిగి రాకపోవడంతో లీగ్ క్వాలిటీ దెబ్బతింటుందనే వాదనలు వినిపించాయి. వీటిని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కొట్టిపడేశారు. దాదాపుగా అందరు విదేశీ ప్లేయర్లు తిరిగి వచ్చారని, కొందరు మిస్ అయినా ఆ ప్రభావం లీగ్‌పై పడబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ వంటి ప్లేయర్లు తాము రావడం లేదని తమ ఫ్రాంచైజీలకు చెప్పేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్-వెస్టిండీస్ వన్డే సిరీసుల వల్ల ప్లేఆఫ్స్ సమయంలో కొందరు ప్లేయర్లు స్వదేశాలకు వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది.
‘ప్లేయర్ల నిర్ణయాలను మేం అర్థం చేసుకుంటాం. కొంతమంది వాళ్ల దేశం తరఫున ఆడాల్సి ఉంది. ఐపీఎల్ కూడా మరో వారం పొడిగించాం. కాబట్టి ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దాదాపుగా అందరు ప్లేయర్లు తిరిగి వచ్చారు. ఐపీఎల్ క్వాలిటీ ఏమాత్రం తగ్గదని నాకు నమ్మకం ఉంది. ప్లేయర్లపై బీసీసీఐ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. అందరు ప్లేయర్లు, బోర్డులతో బీసీసీఐకి, ఫ్రాంచైజీలకు మంచి సంబంధాలున్నాయి. ఆటగాళ్లపై ఒత్తిడి పెడితే నాణ్యమైన ఆట రాదు’ అని ధుమాల్ స్పష్టం చేశారు.






