- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ వాయిదా.. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ స్పందన ఇదే
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో ఐపీఎల్-2025ను బీసీసీఐ వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో ఐపీఎల్-2025ను బీసీసీఐ వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. వారం తర్వాత టోర్నీ తిరిగి ప్రారంభమవుతుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ నిర్ణయంపై మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. టోర్నీని నిర్వహించే సామర్థ్యం బీసీసీఐకి ఉందని తెలిపాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 2020, 2021 ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశాడు.‘ఐపీఎల్‌ను 7రోజులపాటు నిలిపివేశారని చూశాను. బీసీసీఐ ఈ టోర్నీని పూర్తి చేస్తుంది. కొవిడ్ లాంటి ఎమర్జెన్సీ సమయంలోనూ బోర్డు ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించింది. కాబట్టి, బీసీసీఐ కచ్చితంగా టోర్నీని పూర్తి చేస్తుంది. భారత ప్రభుత్వం గైడ్‌లైన్స్ మేరకు బీసీసీఐ పనిచేస్తుంది.’ అని దాదా తెలిపాడు. వరల్డ్‌లో ఐపీఎల్ బెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అని గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 18 ఏళ్లుగా ఐపీఎల్ నుంచి ప్రతిభావంతులు వస్తూనే ఉన్నారని చెప్పాడు. ఈ సీజన్‌లోనూ ప్రియాన్ష్ ఆర్య, సూర్యవంటి, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి ప్లేయర్లు అద్భుతంగా ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు.






