- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు మిస్టరీ స్పిన్నర్‌ను రంగంలోకి దించిన కేకేఆర్
ఐపీఎల్-2025లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. శనివారం ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమవడంతో అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. ఇక, ఆ జట్టు ఈ నెల 25న జరిగే తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి విజయంతో లీగ్‌ను ముగించాలని కేకేఆర్ భావిస్తున్నది.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మిస్టరీ స్పిన్నర్ రాజీవ్ శుక్లాను రంగంలోకి దించింది. వైద్యపరమైన కారణాలతో రొవ్‌మన్ పొవెల్, మెయిన్ అలీ ఐపీఎల్‌కు దూరయ్యారు. దీంతో పొవెల్ స్థానంలో కేకేఆర్ శుక్లాను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం వెల్లడించింది. శుక్లాకు దేశవాళీలో ఆడిన అనుభవం కూడా పెద్దగా లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ మిస్టరీ స్పిన్నర్ 8 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి సత్తాచాటాడు. అలాగే, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఓసారి ఐదు వికెట్ల పర్ఫామెన్స్ ఇచ్చాడు. మరి, కేకేఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని శుక్లా ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.






