IPL 2025: ఈ రోజు మ్యాచ్‌లో ఆ జట్టు ఓడితే ఇంటి బాట పట్టాల్సిందే

by Malleboina Mahesh |

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. గత కొద్ది మ్యాచుల్లో ఓటమిని చవిచూసిన జట్లు తిరిగి పుంజుకొని.. విజయాలను అందుకుంటున్నాయి. దీంతో 18వ ఐపీఎల్ సీజన్ హాట్‌హాట్‌గా కొనసాగుతోంది.

IPL 2025: ఈ రోజు మ్యాచ్‌లో ఆ జట్టు ఓడితే ఇంటి బాట పట్టాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. గత కొద్ది మ్యాచుల్లో ఓటమిని చవిచూసిన జట్లు తిరిగి పుంజుకొని.. విజయాలను అందుకుంటున్నాయి. దీంతో 18వ ఐపీఎల్ (IPL) సీజన్ హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. కానీ ఐపీఎల్ చరిత్ర (History of IPL)లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన చెన్నై (CK) జట్టు మాత్రం రెండో విజయం కోసం పరితపిస్తోంది. టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అవుతుండటం.. బౌలర్లు సరిగ్గా రాణించ లేకపోవడంతో చెన్నై జట్టు ఈ సీజన్ లో వరుసగా ఐదు ఓటములను సొంతం చేసుకొని ప్రమాదంలో పడిపోయింది. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన చెన్నై జట్టు మొదటి మ్యాచులో విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ఆ జట్టు గెలవనే లేదు. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో దారుణమైన ఓటములను అందుకొని ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో గాయం కారణం చెప్పి గైక్వాడ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికి చివరి మ్యాచులో చెన్నై జట్టు ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోరును నమోదు చేసి.. ఓటమిపాలైంది.

ఇదిలా ఉంటే ఈ రోజు చెన్నై జట్టు లక్నో జట్టుతో తలపడనుంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచులో చెన్నై ఓడిపోతే.. టైటిల్ రేసు నుంచి దాదాపు తప్పుకోనుంది. ప్రతీ సీజన్‌లో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడతాయి. ఇందులో కనీసం 7 విజయాలను అందుకున్న జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలవనున్నాయి. అయితే ఇప్పటికే ఐదు ఓటములతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచులో ఓడిపోతే ఆరో ఓటమి ఖాతాలో పడనుంది. దీంతో మిగిలిని ఏడు మ్యాచుల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా కాకుండా ఉండాలంటే నేడు లక్నోతో జరిగే మ్యాచ్ లో చెన్నై జట్టు భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం లక్నో జట్టు ఫామ్ చూస్తే చెన్నై విజయం కష్టంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో CSK జట్టు తమ జట్టును ఫామ్ లోకి తీసుకొచ్చి విజయాన్ని అందుకుంటుందా లేదా అంటే తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Next Story