- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిషేక్ కొట్టిన సిక్స్‌కు కారు అద్దం బద్దలు.. రూ. 5 లక్షలు కట్టిన అభిషేక్.. ఎందుకో తెలుసా?
ఐపీఎల్-18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్స్ కొట్టడంతో రూ. ఐదు లక్షలు కట్టాల్సి వచ్చింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్స్ కొట్టడంతో రూ. ఐదు లక్షలు కట్టాల్సి వచ్చింది. సిక్సర్ కొడితే డబ్బులు కట్టడమేంటని అనుకున్నారంటా?.. అవునండి అభిషేక్ రూ. 5 లక్షలు చెల్లించాడు. అసలేం జరిగిందంటే.. శుక్రవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో 34 రన్స్ చేశాడు. భువనేశ్వర్ వేసిన 2వ ఓవర్‌లో అభిషేక్ భారీ సిక్సర్ కొట్టాడు. బౌండరీ వెలుపల డిస్‌ప్లే కోసం పెట్టిన టాటా కర్వ్ కార్ విండ్ షీల్డ్‌ను బంతి బలంగా తాకడంతో అద్దం పగిలిపోయింది. కారు డ్యామేజ్ కావడంతో అభిషేక్ రూ. 5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్, టాటా మోటార్స్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఏ ప్లేయరైనా కారును డ్యామేజ్ చేస్తే రూ. 5 లక్షలు కట్టాలి. ఆ డబ్బులను గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి, క్రికెట్ కిట్స్ కొనుగోలు ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారమే అభిషేక్ రూ. 5 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘అభిషేక్ ఏమైనా కావాలని కారును డ్యామేజ్ చేశాడా? అందులో అతనిదేం తప్పేం ఉంది. బీసీసీఐగానీ, టాటా మోటర్స్ చేసే స్వచ్ఛంద సేవకు ప్లేయర్లు డబ్బులు ఇవ్వాలా?’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.






