- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rishabh Pant: పంత్ పరువు తీసేసిన ఐస్‌ల్యాండ్.. ఏం చేసిందంటే?
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పరువు తీసేసింది ఐస్‌ల్యాండ్ క్రికెట్. ఈ ఐపీఎల్‌లో అతను బిగ్గెస్ట్ ఫ్రాడ్ అనేసింది.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025లో భారీ ధరకు కొనుగోలు చేసిన చాలామంది స్టార్ ప్లేయర్లు పరమ చెత్తగా ఆడుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant), కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఎస్‌ఆర్‌హెచ్ స్టార్లు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ.. ఇలా ఈ లిస్టులో చాలా పెద్ద పేర్లే ఉన్నాయి. ఈ సీజన్లో చాలామంది ప్లేయర్లు అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తుంటే.. ఈ ఆటగాళ్లు మాత్రం పరమ చెత్తగా ఆడుతూ తమ జట్ల ఓటముల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇలాంటి ప్లేయర్లతో ఒక టీంను తయారు చేసిన ‘ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు’.. దీనికి ‘ఐపీఎల్ 2025లో ఫ్రాడ్స్, స్కామర్ల టీం’ అని పేరు పెట్టింది. ఇలాంటి వెటకారపు పోస్టులతో వైరల్ అయ్యే ఈ క్రికెట్ బోర్డు.. తమ ‘ఫ్రాడ్ టీం’ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేయడం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలామంది ఫ్యాన్స్.. మరీ ఇంతలా పంత్ పరువు తీసేస్తారా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరేమో పంత్ అట్టర్ ఫ్లాప్ ఆటతీరును చూపిస్తూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు చేసిన పని కరెక్టే అంటున్నారు.
ఈ ఏడాది పంత్ (Rishabh Pant) అత్యంత దారుణమైన ఫామ్‌లో ఉన్నాడు. రూ.27 కోట్లకు అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. కానీ అతని ఆటతీరు మాత్రం అందరి కన్నా వరస్ట్‌గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఏ మ్యాచులోనూ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా పంత్ ఆడలేదు. అతని సగటు కేవలం 12 మాత్రమే. అతనితోపాటు రాహుల్ త్రిపాఠీ, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్ వంటి ప్లేయర్లు కూడా ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నారు.
ఐస్‌ల్యాండ్ ఎంపిక చేసిన ఫ్రాడ్స్ జట్టు: రాహుల్ త్రిపాఠీ, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్‌కీపర్), వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, అశ్విన్, పతిరాణా, మహమ్మద్ షమీ. నో ఇంపాక్ట్ ప్లేయర్: ముఖేష్ కుమార్.
On a rain day in Reyjavík, we give you our IPL 2025 frauds and scammers team:
— Iceland Cricket (@icelandcricket) May 5, 2025
R Tripathi
R Ravindra
I Kishan
R Pant (c & wk)
V Iyer
G Maxwell
L Livingstone
D Hooda
R Ashwin
M Pathirana
M Shami
No impact player: M Kumar






