- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టెడు కష్టాల్లో SRH.. ‘కాటేరమ్మ కొడుకు’ కాపాడేనా?
ఈడెన్స్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా కోల్‌కతా(Kolkata Knight Riders)తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు తడబడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఈడెన్స్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా కోల్‌కతా(Kolkata Knight Riders)తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు హెడ్(4), అభిషేక్(2)తో పాటు కిషన్(2), నితీష్ కుమార్ రెడ్డి(19) కూడా నిరాశపర్చారు. దీంతో భారమంతా యువ ప్లేయర్లు అనికేత్‌తో పాటు కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ పైనే పడింది. ప్రస్తుతం తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు నష్టపోయిన ఎస్‌ఆర్‌హెచ్ 64 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 150 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్, మెండీస్ ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (60), రఘువంశీ (50) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. రహానే (38), రింకు సింగ్ (32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో షమి, కమిన్స్, అన్సారీ, మెండిస్, ఇర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.






