IPL 2025 : ఒకే దెబ్బకు మూడు బెర్త్‌లు.. ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్

by Harish |

పీఎల్‌-18లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది.

IPL 2025 : ఒకే దెబ్బకు మూడు బెర్త్‌లు.. ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌-18లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఢిల్లీపై గెలుపుతో గుజరాత్‌పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. 18 పాయింట్లతో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా.. చెరో 17 పాయింట్లతో ఆర్సీబీ, పంజాబ్ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, మిగిలిన నాలుగో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ కింగ్స్ పోటీపడుతున్నాయి. ముంబై(14) 4వ, ఢిల్లీ(13)5వ, లక్నో(10) 7వ స్థానాల్లో ఉన్నాయి. ఇందులో ముంబైకే ఎక్కువ చాన్స్‌లు ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి అవకాశం ఉంది. ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచ్‌లలో, లక్నో తమ చివరి మూడు గేముల్లో తప్పక గెలవాల్సిందే. ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్‌ కోల్పోయినా ఎలిమినేట్ అవుతాయి.

Next Story