IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆ స్టార్ ప్లేయర్

by Harish |

గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగలింది. ఆ జట్టుకు చెందిన మరో విదేశీ ప్లేయర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.

IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆ స్టార్ ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగలింది. ఆ జట్టుకు చెందిన మరో విదేశీ ప్లేయర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అతని రాకపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో గుజరాత్ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్-18 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

గజ్జల్లో గాయం కారణంగా అతను టోర్నీని వీడక తప్పలేదు. ఈ మేరకు గుజరాత్ టైటాన్స్ శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఈ నెల 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ గాయపడ్డాడు. గజ్జల్లో గాయం కారణంగా అతను తిరిగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఫిలిప్స్ త్వరగా కోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఆకాంక్షిస్తోంది.’అని తెలిపింది. మెగా వేలంలో ఫిలిప్స్‌ను గుజరాత్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, ఈ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

అయితే, ఈ నెల 6న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. ఫీల్డింగ్ చేస్తుండగా ఫిలిప్స్ గాయపడ్డాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో అతనికి గజ్జల్లో గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫిలిప్స్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అయితే, టైటాన్స్ యాజమాన్యం ఫిలిప్స్ స్థానాన్ని భర్తీ చేస్తుందా?లేదా? అన్నది ఇంకా తెలియదు.


Next Story