- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gautam Gambhir: ఆడొద్దనే హక్కు ఎవరికీ లేదు.. రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై గంభీర్ క్లారిటీ
టెస్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారి భవిష్యత్తుపై గంభీర్ స్పందించాడు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరూ రాణిస్తున్నంత కాలం జట్టులో కొనసాగుతారని గంభీర్ అన్నాడు. ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. వన్డేల్లో వీళ్లిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) తన చివరి ఐదు టెస్టుల్లో 24 సగటుతో పేలవ ప్రదర్శన చేస్తే.. రోహిత్ (Rohit Sharma) తన చివరి మూడు టెస్టుల్లో దారుణంగా 6.20 సగటుతో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వీళ్లను టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. వీటిపై తాజాగా గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు.
‘వాళ్లు రాణిస్తున్నంత కాలం జట్టులో ఉండాలి. ఆడితే జట్టులో కచ్చితంగా ఉంటారు. రాణిస్తున్న ప్లేయర్‌ను ఆడొద్దనే హక్కు కోచ్, సెలెక్టర్, చివరకు బీసీసీఐకి కూడా లేదు. జట్టును ఎంపిక చేయడం కోచ్ పని కాదు, సెలెక్టర్ల పని. ఎంపికైన వాళ్లు దేశం కోసం రాణించేలా చూడటమే నా పని’ అని స్పష్టం చేశాడు.






