ఐపీఎల్‌లో ఇక SRH పుంజుకోవడం కష్టమే.. టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-05 01:38:41  IST  )

వరుస ఓటములతో ఓవైపు అభిమానులను, ఇంకోవైపు యాజమాన్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు నిరాశ పరుస్తోంది.

ఐపీఎల్‌లో ఇక SRH పుంజుకోవడం కష్టమే.. టీమిండియా మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఓటములతో ఓవైపు అభిమానులను, ఇంకోవైపు యాజమాన్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు నిరాశ పరుస్తోంది. ఉప్పల్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి స్టార్ట్ ఇచ్చినా.. ఆ తర్వా తర్వాత వరుసగా ఓటమి చెందుతోంది. దీంతో ఈ సీజన్‌లో 300 రన్స్ చేయాలని కోరుకున్న SRH ఫ్యాన్స్.. ఇప్పుడు కనీస గెలిస్తే చాలని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన హైదరాబాద్.. ఒకటి గెలిచి.. మూడు ఓడిపోయింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్(Mohammed Kaif) షాకింగ్ కామెంట్స్ చేశారు.


ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు క్లిక్ అవడం కష్టమే అని అన్నారు. బౌలింగ్ చాలా పేలవంగా ఉందని.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్పిన్నర్లకు జట్టులో ఎందుకు చోటు ఇవ్వడం లేదో తెలియట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక్కోసారి మెరుపు వేగంతో ఆడి.. అభిమానుల్లో ఆ జట్టు భారీ అంచనాలు పెంచింది. ఇప్పుడు ఆ అంచనాలు అందుకునే క్రమంలో ఒత్తిడి పెరిగి అసలుకే మోసం వస్తోందని అన్నారు. ఓపెనర్లు అయిన అభిషేక్ శర్మ(Abhishek Sharma), ట్రావిస్ హెడ్(Travis Head) వీక్‌నెస్‌నలు దాదాపు అన్ని జట్ల బౌలర్లు పసిగట్టేశారని తెలిపారు. జట్టు సమిష్టిగా రాణిస్తే తప్ప.. మళ్లీ పుంజుకొని ప్లేఆఫ్స్‌కు చేరడం మాత్రం కష్టంగానే కనిపిస్తోందని అన్నారు.

Next Story