కర్ణాటక సీఎం‌కు ఆర్సీబీ ఫ్యాన్ లేఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించాలని విజ్ఞప్తి

by Harish |

ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తాచాటుతోంది.

కర్ణాటక సీఎం‌కు ఆర్సీబీ ఫ్యాన్ లేఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించాలని విజ్ఞప్తి
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తాచాటుతోంది. క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరో విజయం సాధిస్తే ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఓ ఆర్సీబీ ఫ్యాన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖ వైరల్‌గా మారింది. బెలగావి జిల్లాకు చెందిన శివానంద్ మల్లన్నవర్ ఆ లేఖ రాశారు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే ఆ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని అభ్యర్థించాడు. ఆర్సీబీ అభిమానులు ప్రతి ఏడాది ఆ రోజును వేడుకగా జరుపుకునేందుకు పబ్లిక్ హాలిడే ఇవ్వాలన్నాడు. కర్ణాటక రాజ్యోత్సవ మాదిరిగా ‘ఆర్సీబీ ఫ్యాన్స్ ఫెస్టివల్’‌గా ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాడు. ఆర్సీబీ విజేతగా నిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, అన్ని జిల్లాలలో ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నాడు. మల్లన్నవర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆర్సీబీ అభిమానులు మద్దతు తెలుపుతుండగా.. పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.


Next Story