- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లే ఆఫ్ జట్లకు చుక్కలు చూపిస్తున్న ఎలిమినేటర్ జట్లు
ఐపీఎల్ 2025 చివరి దశకు చేరుకుంది. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులకు ఒక్క అడుగు దూరంలో 18 సీజన్ నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 చివరి దశకు చేరుకుంది. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ (Qualifier, Eliminator) మ్యాచులకు ఒక్క అడుగు దూరంలో 18 సీజన్ (18 season) నిలిచింది. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా భారీ విజయాలతో గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ, ముంబై జట్లు ప్లే ఆఫ్ చేరుకున్నాయి. ఎన్నో ఆశలు ఉన్న ఢిల్లీ, లక్నో, చెన్నై, కేకేఆర్, రాజస్థాన్, సన్ రైజర్స్ జట్లు ఫేలవమైన ఆట తీరుతో టోర్నీ నుంచి ఎలిమినేట్ (Eliminate) అయ్యాయి. కానీ చివరి మ్యాచ్‌లలో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన జట్లకు ఎలిమినేటర్ జట్లు చుక్కలు చూపిస్తున్నాయి.
కీలక సమయంలో టాప్2 పొజిషన్‌ల కోసం గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ జట్లు పోటి పడుతుండగా.. వరుసగా మూడు మ్యాచుల్లో ఆ జట్లకు ఎలిమినేటర్ జట్లు ఓడించి షాక్ ఇచ్చాయి. దీంతో చివరి మ్యాచ్ వరకు టాప్ 2 జట్లు ఎవరో తేలే పరిస్థితి కనిపించడం లేదు. కాగా ఈ రోజు గుజరాత్, చెన్నై జట్లు మధ్య మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే గుజరాత్ జట్టు నేరుగా టాప్ 1 పొజిషన్ కఫ్ఫామ్ చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆర్సీబీ(RCB), పంజాబ్, ముంబై జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. కాగా ఈ సీజన్ లో ఎమ్‌ఎస్ ధోని (MS Dhoni) ఈ రోజు ఆడబోయేది చివరి మ్యాచ్ కావడంతో తప్పక విజయం సాధించాలనే కసితో ప్లేయర్లు కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టిక, క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులను నిర్ణయించనుంది.






