- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: ఆర్సీబీకి షాక్.. ఐపీఎల్ నుంచి పడిక్కల్ అవుట్!
గాయం కారణంగా ఆర్సీబీ స్టార్ దేవదత్ పడిక్కల్ ఈ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో వెటరన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ఆర్సీబీ తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఎదురుదెబ్బ. ఫామ్‌లో ఉన్న ఎడం చేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) ఈ సీజన్‌కు దూరమయ్యాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతను తప్పుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. అతని స్థానంలో వెటరన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ఆర్సీబీ తీసుకుంది. ఈ క్రమంలో మయాంక్‌తో రూ.కోటి ఒప్పందం చేసుకున్నట్లు ఆర్సీబీ తెలిపింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఆర్సీబీ (RCB) విజయాల్లో పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణించాడు. మొత్తం 10 మ్యాచులు ఆడిన అతను రెండు హాఫ్ సెంచరీల సాయంతో 247 పరుగులు చేశాడు. గత కొన్ని సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన పడిక్కల్.. ఈ ఏడాది తన ఆటతీరును మార్చుకొని మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో పడిక్కల్ దూరమవడం ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.






