- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB మ్యాచ్‌లో యాదృచ్చిక సంఘటన.. 18 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?
ఐపీఎల్(IPL)లో యాదృచ్ఛిక ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL)లో యాదృచ్ఛిక ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో RCB ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచులో జరిగిన పలు యాదృచ్ఛిక సంఘటనలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ తొలి సీజన్ ఫస్ట్ మ్యాచులో KKRపై ఆర్సీబీ తొమ్మిది ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 43 పరుగులే చేయగలిగింది. నిన్నటి మ్యాచులోనూ RCB 9 ఓవర్లలో మరోసారి ఏడు వికెట్లు కోల్పోయి యాదృచ్ఛికంగా మరోసారి 43 పరుగులే చేసింది. అటు కోహ్లీ కూడా అప్పుడు, ఇప్పుడు ఒకే రన్ చేయగా, RCB రెండు సార్లూ ఓడిపోయింది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ, నాలుగు మ్యాచులు గెలిచి, మూడు మ్యాచుల్లో ఓడింది. సీజన్ స్టార్టింగ్‌లో దూకుడుగా కనిపించగా, ఇప్పుడా దూకుడు కాస్త తగ్గిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.






