- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: చెన్నై ఘోర ఓటమి.. ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్(IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బాటలో నడుస్తోంది. మూడో ఓటమిని తన ఖాతాలో వేసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బాటలో నడుస్తోంది. మూడో ఓటమిని తన ఖాతాలో వేసుకున్నది. చెన్నైలోని చిదంబరం మైదానం(Chidambaram Stadium) వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు(Delhi Capitals) ఘన విజయం సాధించింది. దాదాపు 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఒకరిద్దరు బ్యాటర్లు మినహా మిగిలిన ప్లేయర్లంతా అద్భుతంగా రాణించారు. రాహుల్(77), పోరెల్(33), అక్షర్(21), రిజ్వీ(20), స్టబ్స్(24) పరుగులతో రాణించారు. దీంతో మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు 183 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, జడేజా, నూర్, పతిరాణా తలో వికెట్ తీశారు.
184 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై బ్యాటర్లు.. వరుసగా విఫలం అయ్యారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర(3), కాన్వే(13), గైక్వాడ్(5), దూబే(18)తో విఫలం అయ్యారు. విజయ్ శంకర్(69), ధోనీ(30) చివరి వరకు పోరాడి నాటౌట్‌గా నిలిచినా ఓటమి తప్పలేదు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు 158 పరుగులకే పరిమితం అయ్యింది. ఢిల్లీ బౌలర్లలో నిఘమ్ రెండు వికెట్లు తీయగా, స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.






