- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: థ్రిల్లింగ్ మ్యాచ్.. చెన్నైపై బెంగళూరు ఘన విజయం
చిన్నస్వామి మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: చిన్నస్వామి మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఉత్కంఠ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ (94), జడేజా (77) పరుగులతో అద్భుతంగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగులకు పరిమితం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా, కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాటర్లు కూడా అదరగొట్టారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు 213 పరుగులు చేశారు. కోహ్లీ (62), జాకబ్ (55), షెఫర్డ్ (54) పరుగులతో రాణించి జట్టుకు భారీ స్కోరును అందించారు. చెన్నై బౌలర్లలో పతిరాణా మూడు వికెట్లు, సామ్ కరణ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో బెంగళూరు పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది.






