‘ఏ+’ కేటగరీలోనే కోహ్లీ, రోహిత్.. స్పష్టం చేసిన బీసీసీఐ

by Phanindra |

టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ ‘ఏ+’ కేటగరీలోనే కొనసాగుతారా? అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ సైకియా సమాధానమిచ్చారు.

‘ఏ+’ కేటగరీలోనే కోహ్లీ, రోహిత్.. స్పష్టం చేసిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. గతేడాది టీ20లకు కూడా వీళ్లిద్దరూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో బీసీసీఐ వీరి కాంట్రాక్ట్‌లను కూడా ‘ఏ+’ కేటగరీ నుంచి తగ్గిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు.

‘వాళ్లిద్దరూ భారత్ కోసం ఆడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ల ఏ+ కేటగరీని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? వాళ్లు అదే కేటగరీలో కొనసాగుతారు’ అని సైకియా స్పష్టంచేశారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన ప్లేయర్ కాంట్రాక్టులు ఏడాది సెప్టెంబరు 30న ముగుస్తాయి. మరి అప్పుడు రోహిత్, కోహ్లీ కాంట్రాక్టులు మారతాయేమో చూడాలి.

Next Story