- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ప్లే ఆఫ్స్‌కు విల్ జాక్స్, రికెల్టన్ దూరం.. మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్‌తో ముంబై చర్చలు
ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు విల్ జాక్స్(ఇంగ్లాండ్),ర్యాన్ రికెల్టన్(సౌతాఫ్రికా) దూరం కానున్నారు.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు విల్ జాక్స్(ఇంగ్లాండ్),ర్యాన్ రికెల్టన్(సౌతాఫ్రికా) దూరం కానున్నారు. వాయిదా కారణంగా స్వదేశానికి వెళ్లిన వీరు ఇండియాకు తిరిగివచ్చారు. చివరి రెండు గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. అయితే, జాతీయ బాధ్యతల కారణంగా వీరు నాకౌట్ రౌండ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ముంబై వీరి స్థానాలను భర్తీ చేసే పనిలో పడింది.
ఇంగ్లాండ్‌కు చెందిన బెయిర్ స్టో, రిచర్డ్ గ్లీసన్‌తో ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది జూన్ నుంచి బెయిర్ స్టో ఇంగ్లాండ్ తరపున ఏ ఫార్మాట్లోనూ ఆడటం లేదు. ఐపీఎల్ మెగా వేలంలోనూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. గతంలో బెయిర్ స్టో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు, గ్లీసన్ గతేడాది చెన్నయ్ సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ సీజన్లో రికెల్టన్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 336 రన్స్ చేశాడు. అతని సేవలను కోల్పోవడం ముంబైకి లోటే.
వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ముంబైకి గత మ్యాచ్‌లో గుజరాత్ బ్రేక్ వేసింది. ఆ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 21న ఢిల్లీతో తలపడనుంది.






