- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Andre Russell: ఈ ఐపీఎల్ తర్వాత రస్సెల్ రిటైర్‌మెంట్? టీంమేట్ సమాధానమిదే..!
ఐపీఎల్ 2025లో పేలవంగా ఆడుతున్న ఆండ్రీ రస్సెల్.. వచ్చే ఏడాది రిటైర్ అయిపోతాడని వార్తలు వస్తున్నాయి. వీటిపై రస్సెల్ టీంమేట్ స్పందించాడు.

దిశ, స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఇటీవల పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత అతను క్రికెట్‌కు వీడ్కోలు పలికేస్తాడని, రిటైర్ అయిపోతాడని వార్తలు వినిపించాయి. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ధనాధన్ షాట్లతో అదరగొట్టిన రస్సెల్.. తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. కేవలం 25 బంతుల్లోనే 57 పరుగులు చేసి కేకేఆర్‌కు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలోనే రస్సెల్ ఇప్పుడప్పుడే రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తేల్చేశాడు.
‘తను (Andre Russell) ఇంకో 2-3 ఐపీఎల్ సైకిల్స్ ఆడాలని అనుకుంటున్నాడు. అంటే ఈజీగా మరో ఆరేళ్లు ఆడతాడు’ అని వరుణ్ చెప్పాడు. అలాగే స్పిన్నర్లను రస్సెల్ ఆడలేకపోతున్నాడనే వార్తల్లో కూడా నిజం లేదన్నాడీ మిస్టరీ స్పిన్నర్. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో కూడా మహీష్ తీక్షణ, వానిందు హసరంగ బౌలింగ్‌లో రస్సెల్ తన విధ్వంసకర బ్యాటింగ్ ఆడలేకపోయాడు. అయితే అలాంటిదేం లేదని, రస్సెల్ కావాలనే స్పిన్నర్ల బౌలింగ్‌లో రిస్కులు తీసుకోలేదని వరుణ్ అభిప్రాయపడ్డాడు. ‘అది తన చాయిస్ అనే నేను అనుకుంటున్నా’ అని స్పష్టం చేశాడు.
‘తను మంచి ఫిట్‌గా ఉన్నాడు. అలాంటప్పుడు వయసు ఎంత వస్తే ఏంటి? జట్టు విజయాల్లో భాగమైతే చాలు. ముఖ్యంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఎవరూ మనల్ని నిలదీయరు కదా’ అని వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అన్నాడు. మూడేళ్లకు ఒకసారి జరిగే మెగావేలంతో ఒక ఐపీఎల్ సైకిల్ ముగుస్తుంది. అంటే ఇంకో రెండు ఐపీఎల్ సైకిల్స్ ఆడాలన్నా కూడా రస్సెల్ (Andre Russell) మరో ఆరేళ్లు ఆడాల్సిందే. ఫిట్‌గా ఉంటే 40 ఏళ్లు వచ్చాక కూడా ఆడేందుకే రస్సెల్ మొగ్గుచూపుతున్నాడన్నమాట.






