- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐ వేటు వేసింది.. కేకేఆర్ తిరిగి చేర్చుకుంది
టీమ్ ఇండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి చేరాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి చేరాడు. నాయర్ కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరినట్టు కోల్‌కతా ఫ్రాంజీ శనివారం తెలిపింది. భారత జాతీయ జట్టు అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి నాయర్‌ను బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూరుకు ముందు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌లో బోర్డు భారీ మార్పులు చేపట్టింది. అభిషేక్ నాయర్‌తోపాటు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ట్రైనర్ సోహమ్ దేశాయ్‌లను బాధ్యతల నుంచి తొలగించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే బోర్డు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నాయర్‌పై బీసీసీఐ వేటు వేసిన మరుసటి రోజే అతను కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరడం గమనార్హం. కోల్‌కతా ఫ్రాంచైజీతో నాయర్‌కు మంచి అనుబంధం ఉంది. 2018 నుంచి 2024 వరకు ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో అతను భాగంగా ఉన్నాడు. అలాగే, కేకేఆర్ అకాడమీకి ఇన్చార్జి కూడా.






