IPL 2023: వైట్‌డ్రెస్‌లో తళక్కుమన్న కావ్య పాప..

by Vinod kumar |   (  Updated:2023-04-02 13:01:57  IST  )

IPL 2023: వైట్‌డ్రెస్‌లో తళక్కుమన్న కావ్య పాప..
X

హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కనర్లేదు. ఎస్‌ఆర్‌హెచ్ ప్రతి మ్యాచ్‌కు ఆమె కచ్చితంగా హాజరవుతుంది. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌కు ఓనర్ కావ్య మారన్ హాజరైంది. ఎస్‌ఆర్‌హెచ్ డగౌట్‌లో వైట్ డ్రెస్‌లో సన్‌గ్లాసెస్ పెట్టుకుని తళక్కుమని మెరిసింది.

ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. చెత్త ప్రదర్శన చేసింది. రాజస్థాన్ బ్యాటర్లు బట్లర్, యశ్వసి జైశ్వాల్, శాంసన్ హైదరాబాద్ బౌలింగ్‌లో ఊచకోత కోశారు. ఎస్‌ఆర్‌హెచ్ చెత్త ప్రదర్శనతో డకౌట్‌లో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కావ్య మారన్ కోసమైన బాగా ఆడాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Read more:

IPL 2023: వీఐపీ స్టాండ్స్‌లో రానా నాయుడు

Next Story