- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: కోహ్లీ కాళ్లు మొక్కిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్!
IPL 2023: కోహ్లీ కాళ్లు మొక్కిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్!
by Vinod kumar |
కోల్‌కతా నైట్‌రైడర్స్ బిగ్ హిట్టర్ రింకూ సింగ్ కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్ బిగ్ హిట్టర్ రింకూ సింగ్ కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్‌కు వెళ్లే క్రమంలో రింకూ సింగ్.. విరాట్ కోహ్లీ పాదాలను టచ్ చేసి ఆశీర్వాదం తీసకున్నాడు. వెంటనే కోహ్లీ అతన్ని లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 21 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
Next Story






