- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసేయాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ బీసీసీఐని కోరాడు. ఆదివారం కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ..‘దయచేసి ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌ను తొలగించండి. ఇప్పటికే పిచ్ నుంచి బౌలర్లకు అనుకూలంగా లేవు. గతంలో వికెట్లు నెమ్మదిగా ఉండేవి. కానీ, ఈ నిబంధన బ్యాటర్లకు ఆటను సులభతరం చేసింది. గతంలో ఓ జట్టు 250పైగా స్కోర్లు చేయడం అరుదుగా కనిపించేది. కానీ, ఇప్పుడు సాధారణమైంది.’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై క్రికెటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఈ రూల్‌తో ఆల్‌రౌండర్లకు, బౌలర్లకు నష్టం కలుగుతుందని చెప్పిన విషయం తెలిసిందే.
Next Story






