IPL 2023: ఆరో వికెట్ డౌన్.. తేలిపోయిన హైదరాబాద్ బ్యాటర్స్.. ఓటమి దిశగా..

by Vinod kumar |   (  Updated:2023-04-02 13:17:55  IST  )

సొంతగడ్డపై ఐపీఎల్-16 ప్రస్థానం ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఛేజింగ్ లో కష్టాలు ఎదురయ్యాయి.

IPL 2023: ఆరో వికెట్ డౌన్.. తేలిపోయిన హైదరాబాద్ బ్యాటర్స్.. ఓటమి దిశగా..
X

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై ఐపీఎల్-16 ప్రస్థానం ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఛేజింగ్‌లో కష్టాలు ఎదురయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ విసిరిన 204 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 8.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బౌల్ట్.. అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0)లను డకౌట్ చేసిన ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 6 వికెట్లు కోల్పోయి 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం సామద్ (7), రషీద్(14) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Next Story